Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ప్రశంసించిన సీఎం..! 5 d ago
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. ద్రౌపది ముర్ము సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి.. రాష్ట్రపతి హోదా వరకు వచ్చారని ప్రశంసించారు. క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం ఉంటే ఏమైనా సాధించవచ్చని ద్రౌపది ముర్ము నిరూపించారని పేర్కొన్నారు. మనలాంటి ఎంతో మంది సామాన్యులకు ద్రౌపది ముర్ము జీవితమే పెద్ద ఉదాహరణ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.